అలా ఎందుకు చెప్తారో.. ఇది చదివి తెలుసుకోండి..!

-

ఇంట్లో మన పెద్దవాళ్లు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు పాటిస్తుంటారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు కొన్ని చిట్కాలు పాటించి సమస్యను పరిష్కరించేస్తుంటారు. అప్పుడప్పుడు చాదస్తపు మనుషుల్లా ప్రవర్తిస్తుంటారు. మనం అప్పుడు ఇదే చాదస్తం రా.. బాబు.. పరిగెత్తిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. అయితే వారి చాదస్తం వెనకాల ఎన్నో లాజిక్స్ దాగి ఉన్నాయి. వాటి వల్ల జరిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే.

human-with-red-stop
human-with-red-stop

‘రాత్రి పూట రావి చెట్టు కింద పడుకోవద్దు’.. రాత్రి పూట రావి చెట్టు కింద పడుకోవద్దు చాలా మంది చెబుతుంటారు. రావి చెట్టు అంటే టక్కున గుర్తుకు వచ్చేది.. ఈ చెట్టు ద్వారా ఆక్సిజన్ అధికంగా రిలీజ్ అవుతుందని, ఆక్సిజన్ ఎక్కువగా విడుదలయ్యే చెట్టు కింద ఉంటే మంచిదే అనుకునేరు. ఎందుకంటే ఉదయం పూట ఆక్సిజన్ ని విడుదల చేసే రావిచెట్టు రాత్రి అయితే కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. దీనివల్ల రాత్రి పూట చెట్టుకింద పడుకుంటే.. శ్వాస సమస్య ఉన్న వాళ్ల ప్రాణానికే ప్రమాదం.

‘ఇంటి గుమ్మానికి నిమ్మ, పచ్చిమిర్చి ఎందుకు వేలాడదీస్తారు’.. గుమ్మానికి నిమ్మకాయలు, పచ్చిమిర్చిని వేలాడదీస్తుంటారు. అయితే వాటిని గుమ్మానికి వేలాడదీయడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే క్రిమి కీటకాలు నశింపజేసే శక్తి ఈ రెండింటీకి ఉంటుంది. కాబట్టి వీటిని గుమ్మానికి వేలాడదీస్తారు.

‘రాత్రైతే గోళ్లు ఎందుకు కత్తిరించవద్దు’.. పూర్వం విద్యుత్ లేదు. అప్పుడు రాత్రివేళల్లో గోళ్లు కత్తిరించుకుంటే వేళ్లకి గాయాలయ్యేవి. దీంతో పూర్వీకులు రాత్రైతే గోళ్లు కత్తిరించవద్దని చెబుతూ వచ్చారు. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది.

‘పీరియడ్స్ వచ్చినప్పుడు స్త్రీలు ఆలయంలోకి వెళ్లకూడదు’.. పూర్వం మహిళలకు ప్యాడ్స్ అందుబాటులోకి ఉండేవి కావు. పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు అసౌకర్యానికి గురవుతుంటారు. గుడికి వెళ్లినప్పుడు ఎక్కువ సేపు నిలబడటం.. కొంత ఇబ్బంది కలిగించే వ్యవహారమే. అందుకే పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెబుతుంటారు.

‘వారంలో ఒక రోజు ఉపవాసం’.. రోజూ మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. మాంసం జీర్ణం అవడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే మాంసంలో క్రొవ్వు పదార్థాలు అధికమే. కాబట్టి వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటూ కడుపులో ఉన్న చెత్తను క్లీన్ చేసేస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news