నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఈరోజు విడుదలై మంచి విజయ పతం వైపు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్.. కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నవీన్ ఎర్నేని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా సిస్టర్ సెంటిమెంటుతో ఉంటుందని గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అసలు విషయం ఏమిటంటే.. బాలకృష్ణకు చుట్ట తాగే అలవాటు ఉందట. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కచ్చితంగా చుట్ట తాగుతారట. అలాగే ఈ సినిమాలో కూడా చుట్ట తాగే సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని బాలకృష్ణ తెలియజేశారు. చుట్ట తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేష్మం మొత్తం బయటకు వచ్చి.. గొంతు చాలా గంభీరంగా.. డైలాగులు చెప్పడానికి అద్భుతంగా ఉంటుందని.. అందుకే బాలకృష్ణ చుట్ట తాగుతారని సమాచారం.
అంతేకాకుండా సిగరెట్ తాగడం కంటే చుట్ట తాగడం 10 రెట్లు మంచిదని కూడా బాలయ్య చెప్పుకొచ్చారు. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ పాత్ర కోసం ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చిందట. అలాగే ఈ చుట్ట తాగే సీన్ కూడా బాలకృష్ణ కావాలని ఈ సినిమాలో పెట్టించినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏ సినిమా బాలకృష్ణకు అలాగే నందమూరి అభిమానులకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.