దాదాపుగా ఏ వైద్య విధానంలో అయినా సరే.. ట్యాబ్లెట్లను మింగాలంటే కచ్చితంగా నీరు తాగాకే ఆ పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క హోమియో మందులను మింగితే మాత్రం నీటి అవసరం ఉండదు. అయితే మెడిసిన్ ను మింగేటప్పుడు కొందరు చల్లని నీటితో వాటిని మింగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేయడం మంచిది కాదు. మెడిసిన్లను ఎప్పుడూ గోరు వెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో మాత్రమే మింగాలి. మరి చల్లని నీటితో మందులను ఎందుకు మింగకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా మనం చల్లని నీరు తాగితే అది జీర్ణాశయంలో వేడిగా అయ్యాకే శోషించుకోబడుతుంది. ఈ క్రమంలో చల్లని నీటిని వేడిగా మార్చేందుకు శరీరం కొంత శక్తిని కూడా ఖర్చు చేస్తుంది. అయితే చల్లని నీటితో ట్యాబ్లెట్లను మింగినప్పుడు అందులో అవి సరిగ్గా కరగవు. దీంతో శరీరం ఆ ట్యాబ్లెట్లలో ఉండే మందును శోషించుకోదు. ఫలితంగా మనకు ఉన్న అనారోగ్య సమస్య నయం కాదు.
కనుక ఎవరైనా ట్యాబ్లెట్లను మింగేటప్పుడు కచ్చితంగా గోరు వెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే తాగాలి. దీని వల్ల ట్యాబ్లెట్ సరిగ్గా జీర్ణం అవుతుంది. అందులో ఉన్న మెడిసిన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అందుకే సాధారణంగా ఆయుర్వేదంలో పలు రకాల మందులు, టానిక్‌లను గోరు వెచ్చని నీటితో మాత్రమే తాగాలని వైద్యులు చెబుతుంటారు. కనుక.. ఇకపై మీరు కూడా మెడిసిన్ వేసుకోవాలంటే.. చల్లని నీటిని ఉపయోగించకండి. గోరు వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ మిత్రులు, ఇతరులకు ఈ లింక్‌ను షేర్ చేయండి..!