విగ్రహాలు పెరుగుతాయని మీరు ఎప్పుడైనా విన్నారా..? కరీంనగర్ జిల్లాలో కమలాపూర్ లో వరాహ స్వామి విగ్రహం ఉంది. అయితే ఈ విగ్రహం ఏడాదికి ఒక సెంటీ మీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుందట. దేవుడు మహిమ అని ఎంతో మంది భక్తులు భావిస్తున్నారు కానీ నిజానికి దీని వెనక సైన్స్ కూడా ఉంది. ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక వివరాలని చూసేస్తే…
భూగోళం యొక్క వ్యాసార్థం 6,378 కిమీ. అయితే దీనిలోని పై భాగము కిలో మీటర్ల మందం తో ఉంటుంది. గట్టిగా ఉంటుంది ఇది. పెంకులాగా లోపల ఉంటుంది. ఇది ఆరు వేల సెంటిగ్రేడ్ వేడితో కరుగుతున్న లావా అనే ద్రవ పదార్ధం తో ఉంటుంది. పై భాగము చూస్తే గట్టి రాతి పదార్ధం. వివిధ పొరలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇవి కదులుతుంటాయి.
ఈ పొరలు ఒక దానికొకటి ఢీ కొని ఉన్న ప్రతీ సారి కూడా విడిపోయిన భూగంపాలు లేక లోయలు ఏర్పడవచ్చు. అదే ఒక పొర మీద మరొక పొర నెమ్మదిగా ఎక్కితే పైనున్న టెక్టానిక్ పొర లేస్తుంది. భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. భూమి మీద పెరుగుతున్న రాయి లాగ ఇది క్రమేపి కనపడుతుంది. ఒక గుట్టలాగ కొన్నాళ్ళకి మారుతుంది. ఇలా పెరుగుతున్న విగ్రహాలన్నీ కూడా ఒక పీఠం మీద ప్రతిష్టించినవివె కాదు. భూమిలోని రాళ్లుగా మలిచారు.