ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎందుకు ఈ విలయం…

-

సంజయ్ గాంధీ బ్రతికి ఉన్న సమయంలో ఒక ఆలోచనతో జనాభాను తగ్గించవచ్చు అని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చెయ్యాలి అని భావించి దాన్ని కొన్ని రోజులు అమలు చేసారు. కాని అప్పటి విపక్షాలు గర్భంలో భారత దేశాన్ని చిదిమేస్తున్నారు అంటూ కవిత్వాలు రాసాయి. చైనా పరిస్థితి మనకు వస్తుందని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అప్పటికే చైనాలో 90 కోట్లు దాటింది జనాభా. మన దేశంలో ఆ పరిస్థితి వస్తే ఆహార కొరత వస్తుంది ప్రధానంగా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఆర్ధిక ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుందని ఒక కమిటి ద్వారా ఆ అడుగు వేసారు. అప్పుడు దాన్ని నిలిపివేయడంతో దేశంలో జనాభా ఎక్కువగా పెరిగింది అనేది వాస్తవం. వాస్తవాల కంటే మనకు నమ్మకాలు ఎక్కువ.

దేశంలో పరువు ప్రతిష్టలు చాలా ఎక్కువ. అదే ఇప్పుడు కరోనాకు స్వాగతం పలికింది. తెలంగాణాలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చిన వలస కూలీది జార్ఖండ్ రాష్ట్ర౦. అక్కడ తమ ఊరిలో ప్రతీ ఒక్కరికి 18 మంది పిల్లలు ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అందరూ కర్ణాటక, మహారాష్ట్ర పనులు వెతుక్కుంటూ వెళ్లిపోతు ఉంటారు. నాకు 19 మంది కావాలని ప్రయత్నం చేసాడు. పెద్ద కొడుకు పెళ్లి చేసిన తర్వాత భార్యకు 19 వ కాన్పు వచ్చింది.

అలాంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి దేశంలో. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతాల్లో జనాభా చాలా ఎక్కువ. పెద్ద పెద్ద కుటుంబాలు… దానికి తోడు అన్నీ ఉమ్మడి కుటుంబాలే. ఒక్కరికి కూడా చదువు ఉండదు. సొంతగా బ్రతకలేని పరిస్థితి. దీనితో వలస కూలీలుగా దేశం మొత్తం వెళ్లిపోతు ఉంటారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ సరిహద్దు గ్రామాల్లో పెళ్ళిళ్ళు అవ్వక డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళు పేద వారి భార్యలను అద్దెకు తెచ్చుకునే ఖర్మ వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనే కరోనా విలయతాండవం చేస్తుంది. గుజరాత్ మోడీ సొంత రాష్ట్రం… అక్కడ కరోనా కట్టడి కావడం అనేది పెద్ద సవాల్ గా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

దక్షినాది రాష్ట్రాల్లో క్రమశిక్షణ ఉన్నట్టు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండదు. కేసీఆర్ కరోనా వైరస్ ని కట్టడి చేసినట్టు 15 ఏళ్ళ అనుభవం ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేయలేకపోతున్నారు అంటే ప్రధాన కారణం జనాభా ఎక్కువ వాళ్లకు క్రమశిక్షణ లేకపోవడం. ఒక్కరికి కూడా అక్కడ రేపు ఏంటీ అనే భయం ఉండదు. ఈ రోజు తిన్నామా లేదా అనే చూస్తారు. తెలంగాణా ప్రభుత్వం బియ్యం ఇవ్వడమే కాదు 1500 ఇస్తుంది.

కాని ఆ రాష్ట్రాల్లో అలా ఇచ్చినా సరే సరిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు బ్రతికేది ఇతర రాష్ట్రాల్లో కాబట్టి ఆ రాష్ట్రానికి వాళ్ళతో వచ్చే ఉపయోగం ఏదీ లేదు. ఒక్క ఓటు వేయడానికి మినహా… 420 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్… ప్రధాని సీటుని శాసించే రాష్ట్రం. అయినా సరే కరోనా వైరస్ ని కట్టడి చేయలేక ఇబ్బందులు పడుతుంది. ఆర్ధికంగా ఆ రాష్ట్రాలు చితికిపోయాయి. మహారాష్ట్ర ముంబై లేకపోతే బీహార్ కన్నా దారుణంగా ఉంటుంది. కరోనా అనేది ఇప్పుడు వాళ్ళ జీవితాలకే ఒక సవాల్.

Read more RELATED
Recommended to you

Latest news