ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్ట్ మరోసారి సున్నిత హెచ్చరికలు చేసింది. ప్రభుత్వం అనేక కేస్ లలో ఇన్ టైం లో కౌంటర్ ఫైల్ చేయకపోడం పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి లోని తిరుచానూరు గ్రామం కు చెందిన వి ఆర్ ఓ 35 లక్షలు మేర నిధులు దుర్వినియోగం చేసారని 2019 లో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిపై ఏపీ హైకోర్ట్ లో విచారణ చేసారు.
ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లా సెక్రటరీ, సి ఎస్ లకు కౌంటర్లు లేట్ అయితే గవర్నమెంట్ ఖజానా నుండి కాకుండా ఆలస్యం చేసే అధికారులు నుండి అమొత్తం వసూలు చేసి కౌంటర్ లు ఫైల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.