పూర్తిగా కోలుకున్న ట్రంప్.. మళ్ళీ ఎన్నికల ప్రచారానికి ?

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అందిస్తున్న కరోనా చికిత్స పూర్తయినట్టు శ్వేతసౌధం వైద్యడు సియాన్‌ కాన్లే వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో గడిపిన ట్రంప్‌… సోమవారం శ్వేతసౌధం చేరుకున్నారు. అప్పటి నుంచి ట్రంప్‌ అక్కడే చికిత్స పొందారు. ఇక ట్రంప్‌ ప్రజల ముందుకు రావడం సురక్షితమేనని అంటున్నారు డాక్టర్లు. గత శుక్రవారం నుంచి ఆయనలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని చెబుతున్నారు. ఇక ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ కాబోతున్నారు.

 

అయితే, అంతకు ముందే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైట్‌హౌజ్ నుంచి ఫాక్స్ న్యూస్‌ తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ట్రంప్‌ ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమె సోషలిస్టు కాదు.. కమ్యూనిస్టు అంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ట్రంప్‌. రాబోయే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బైడెన్ గెలిస్తే… కేవలం రెండుమూడు నెలల్లో క‌మ్యూనిస్టు క‌మ‌లా హారిస్ ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తీసుకుంటుంద‌ని ట్రంప్ ఆరోపించారు. ఆమె అభిప్రాయాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే కమ్యూనిస్టు అని స్పష్టమవుతోందన్నారు. స‌రిహ‌ద్దుల్ని ఓపెన్ చేసి.. హంత‌కుల‌ను, రేపిస్టుల‌ను దేశంలోకి ఆహ్వానించాల‌న్నది కమలాహారిస్‌ అభిమతమనీ.. ట్రంప్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news