పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడు ?

-

పరశురామ అవతారంలో అనేక విశేషాలు. ఆయన ఒకసారి తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించాడు. ఆ వృత్తాంతం తెలుసుకుందాం…
పరశురాముడి తండ్రి జమదగ్నిమహర్షి. తల్లి రేణుక. ఒకసారి రేణుక నీళ్ళ కోసం చెరువు దగ్గరికి చేరుకోగా అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండిపోయింది. ప్రతిరోజూ మట్టితో కుండను చేసి దానిలో నీళ్ళను ఆశ్రమానికి తీసుకుని వెలుతుండేది. కానీ ఆ రోజున పరధ్యానంగా ఉండడంతో కుండ తయారు చేయలేక ఉత్తి చేతులతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది.

అది గమనించిన జమదగ్ని తన దూరదృష్టితో అంతా తెలుసుకుని కోపంతో రేణుకను నరకమని తన కొడుకులకు చెప్పగా వారు ఎవరూ ముందుకు రారు. రేణుకను సంహరించమని పరశురాముడిని ఆజ్ఞాపించగా పితృవాక్కు జవదాటని పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారమే రేణుక తలను నరికేస్తాడు. సంతోషించిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని పరశురాముడిని అడగగా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని తండ్రిని వేడుకున్నాడు. జమదగ్ని రేణుకకు పునర్జన్మ ప్రసాదించాడు.

– శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news