ఇదేం వాతావరణం ఇలా మారిపోయింది…?

-

వాతావరణ మార్పులను అంచనా వేయడం అనేది ఎవరికి సాధ్య౦ కాదు. అది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ప్రస్తుతం మన దేశంలో వాతావరణ పరిస్థితులు అంచనా వేయలేని విధంగా ఉన్నాయి. అకాల వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి.

అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం దాదాపుగా నమోదు అయింది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, తెలంగాణాలో హైదరాబాద్, ఖమ్మ౦ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మార్చి, ఏప్రిల్‌లో విపరీతమైన ఎండల్ని చూసిన ప్రజలకు ఇప్పుడు వర్షాలు కాస్త చల్లదనాన్ని ఇస్తున్నాయి. అయితే రైతులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టపోతున్నారు. కరోనా దెబ్బకే సగం నష్టపోయిన రైతు..

ఇప్పుడు వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయారు రైతులు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వర్షాలు పడితే మాత్రం పూర్తిగా నాశనం అనే ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాలు పడగానే కొందరికి జలుబు జ్వరం బయటపడుతుంది. అప్పుడు కరోనా పరిక్షలు చాలా కష్టం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news