ఆలయంలో ప్రదక్షణలు ఎందుకు చేస్తారుఆలయంలో ప్రదక్షణ ఎందుకు చేస్తారు?

-

హిందువులు దేవుళ్లను ఎక్కువగా పూజిస్తారు.. అయితే గుడ్లో ప్రదక్షణలు ఎందుకు చేస్తారు.. అలానే ఎందుకు చెయ్యాలి. ఇలాంటి సందేహాలు రావడం కామన్..అలా చెయ్యడం వెనుక ఏదైనా రహస్యం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటూ ఉంటారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు. అసలు ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి?ఈ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా గ్రహాచారాలు బాగాలేకపోయిన అవి సరి అవుతాయి. ఇకపోతే ప్రదక్షిణలు శ్రద్ధతో చేతులు జోడించి చేయడం వలన మేలు జరుగుతుంది.

అయితే ప్రదక్షిణలు చేయమన్నారు కదా అని ఎన్ని అంటే అన్ని అస్సలు చేయకూడదు. నియమిత సంఖ్యలోనే ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. ప్ర అంటే పాప నాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చుట, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుంచి విమోచనమ, ణ అనగా జ్ఞానం ద్వారా ముక్తి మార్గంలో పయనించాలి ముక్తిని ప్రసాదించాలని అర్థం.. ఈ ప్రదక్షణలను ఎప్పుడూ ఎడమ నుంచి కుడి వైపుకు చెయ్యాలి.. అలా మనం కుడివైపున అత్యంత ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఐటమ్స్ పెట్టుకుని, ఎడమ వైపున లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాటిని క్యారీ చేస్తుంటాం. అది మన సంప్రదాయంగా వస్తోంది. ఆ క్రమంలోనే ప్రదక్షిణం కుడి వైపునకు చేయడం వల్ల మేలు జరుగుతుందట.. అందుకే ప్రదక్షణలు చేస్తారని నిపుణులు అంటున్నారు.. అదన్నమాట..

Read more RELATED
Recommended to you

Latest news