అయోధ్య రామమందిరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

అయోధ్య రామ మందిరం హిందువులందరికీ చెందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దావోస్ పట్టణంలో ఉన్న ఆయన తాజాగా ఇండియాటుడే ఛానల్ తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయోధ్య రామమందిరానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ మత రాజకీయాలు ఆడుతుందని విమర్శించారు. తాను ఏదో ఒక రోజు అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకుంటున్నానని చెప్పారు.

తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న రామమందిరాన్ని తాను దర్శించుకునేవాడినని.. గుర్తు చేశారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభం కాలేదని అన్నారు. 1993లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేసారు. గత 30 ఏళ్లుగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news