క్రిమినల్ కేసులున్న వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చారు: వైయస్ సునీత

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై సునీత ప్రశ్నల వర్షం కురిపించారు. కడప జిల్లా వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల కోసం కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కడప ఎంపీగా వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తన తండ్రి వివేకా మరణాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు సునీత పలు ప్రశ్నలు సంధించారు. క్రిమినల్ కేసులున్న వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అభ్యర్థి క్రిమినల్ కేసులను అఫిడవిట్‌లో ప్రస్తావించాలని.. అలా చేశారా లేదా నిలదీశారు. నామినేషన్ దాఖలు చేసిన రెండు రోజుల్లో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటన చేయాలని, క్రిమినల్ కేసులున్న వారికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ వెబ్ సైట్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థి నేర చరిత్రపై సీఎం జగన్ ఈసీకి తెలిపారా లేదా అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డికి సంబంధించి క్రిమినల్ కేసులపై ఈసీ కి ఎందుకు తెలపలేదని వైఎస్ సునీత నిలదీశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఓటు వేయొద్దని కోరారు.వైఎస్ వివేకానందారెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news