కే విశ్వనాథ్ ను ఎందుకు ఖననం చేశారంటే..?

-

నిన్నటితో కళాతపస్వి కె విశ్వనాథ్ శకం ముగిసింది. దాదాపు అర్థ శతాబ్దానికి పైగా కళామ్మతల్లి సేవలో తరించి.. 92 సంవత్సరాల వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు.. సినీ ప్రియులు.. ఆయన వల్లే ఫేమ్ పొందినవారు మరింత దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన దాదాపు అన్ని సూపర్ హిట్టు చిత్రాలు కావడం గమనార్హం. అలా సాగర సంగమం, శృతిలయలు, మచ్చుతునకలు, శంకరాభరణం స్వాతిముత్యం, స్వయంకృషి.. ఇలా ఎన్నో చిత్రాల ద్వారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోశారు .

ఇదిలా ఉండగా విశ్వనాథ్ అంత్యక్రియలు నిన్న హైదరాబాదులోనే సాంప్రదాయం ప్రకారం జరిగాయి. అయితే ఇతర బ్రాహ్మణ వ్యక్తులను బ్రాహ్మణ సాంప్రదాయంలోనే పార్థివ దేహాన్ని దహనం చేస్తారు.. తర్వాత అస్థికలను పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ విశ్వనాథ్ పార్థివదేహాన్ని మాత్రం కూర్చోబెట్టి ఖననం చేశారు. అయితే ఇలా ఎందుకు చేశారు అంటే విశ్వనాథ్ పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చిన వీరశైవ ఆరాధ్యులుగా తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు కూడా ఉన్నాయట. వాళ్లు లింగాధారులు. ఉమ్మడి గుంటూరు , కృష్ణ ,నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వీళ్లు ఎక్కువగా కనిపిస్తారు. అయితే కాలక్రమేనా నియోగి బ్రాహ్మణులతో వివాహ బంధాలు ఏర్పరచుకొని అందరితో కలిసిపోయారు.

వీరశైవులను స్థానికంగా లింగధారులు అని కూడా పిలుస్తారు. వారు ఇష్ట లింగా ధారణ చేస్తారు. చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియల సమయంలో దేహం పై ఉన్న శివలింగాన్ని తొలగించకూడదు అంటారు. శవ దహనం చేస్తే శివలింగం కూడా కాలిపోతుంది. అందుకే శివలింగం చెక్కుచెదరకుండా ఉండడానికి వారిని ఖననం చేస్తారు. ఇక విశ్వనాధ్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news