Telangana: అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు.. బీఏసీలో రాని క్లారిటీ..?

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలోనూ క్లారిటీ రాలేదు. అయితే స్పీకర్‌ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్లాలని మాత్రం బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న దానిపై ఈనెల 8న స్పీకర్‌ ప్రకటించేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ఆ రోజు మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుందామని మంత్రులు చెప్పినట్లు సమాచారం.

గవర్నర్‌ ప్రసంగంపైన, బడ్జెట్‌పైన, పద్దులపైన పూర్తిస్థాయిలో చర్చలు జరగాలని కాంగ్రెస్‌ కోరగా… ఏయే అంశాలపై చర్చను కోరుకుంటున్నారో చెప్పండి, ఎన్ని రోజులు నిర్వహించడానికైనా తమకేమీ అభ్యంతరం లేదని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై సీఎం సహా విపక్ష సభ్యులు మాట్లాడతారు. 5న ఆదివారం శాసనసభకు సెలవు. 6న సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 7న అసెంబ్లీకి, మండలికి సెలవు. 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుంది. 9 నుంచి పద్దులపై చర్చ కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news