అత్తాకోడళ్లు ఆషాడ మాసంలో అస్సలు ఎందుకు కలవకూడదు..? పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు..? కారణం ఏమిటి..?

-

తెలుగు నెలల్లో ఆషాడ మాసానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఆషాడ మాసం లో చాలా మంది తప్పకుండా ఆచారాలను పాటిస్తూ ఉంటారు. భార్యా భర్తలు దూరంగా ఉండడం అత్తా కోడలు దూరంగా ఉండడం వంటివి ఆషాడ మాసం లో చాలా మంది పాటిస్తూ ఉంటారు. పైగా ఈ నెల లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరపరు. ఆషాడ మాసానికి ఆధ్యాత్మికపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో పవిత్రమైనది ఆషాడమాసం.

పురాణాల ప్రకారం ఆషాడమాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలో వివాహం చేసుకున్న వాళ్లకి విష్ణుమూర్తి ఆశీస్సులు లభించవు. అందుకే ఆషాడమాసంలో పెళ్లిళ్లు జరగవు. ఆషాడమాసంలో అత్తా కోడళ్ళు ఎందుకు కలవకూడదు అనే విషయానికి వస్తే ఈ సమయంలో కొత్త వధువుని కచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఈ మాసంలో భార్యాభర్తలు కలయిక లో పాల్గొని గర్భం దాలిస్తే వేసవిలో డెలివరీ అవుతుంది అది తల్లి బిడ్డలకి అనారోగ్య సమస్యలు కలగొచ్చు అని పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు. అందుకే కొత్త జంటలు వేరుగా ఉంటారు.

ఆషాడ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి ఈ నెలలో తొలకరి చినుకులు పడి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది ఇదివరక ఎక్కువ మంది పొలం పనులు చేసుకునే వాళ్ళు భార్య అత్తవారింట్లో ఉన్నప్పుడు భర్త పనులకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉండిపోతాడేమో అని ఈ నియమాన్ని పెట్టారు అందుకని అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండడం భార్యాభర్తలు ఒకే చోట ఉండడం మంచిది కాదని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news