ఆహారం చేతితో తింటే మంచిదా? స్పూన్ తో తింటే మంచిదా?

-

మన నిత్య జీవితంలో… అన్నం తినేటప్పుడు కచ్చితంగా మన కుడిచెయ్యి తోనే తింటాం. మరికొంతమంది ఎడమ చేయి తోని తినే వాళ్లు కూడా ఉంటారు. మొత్తానికి చేతి వేళ్ళ తో కలుపుకొని మనం అన్నం తింటాం. అయితే ప్రస్తుత పరిస్థితులు మారిన నేపథ్యంలో చాలా మంది చేతులతో తినడం మానేసి… స్పూను లకు అలవాటు అయిపోయారు. ఇక ఈ విధంగా తినే వాళ్ళ కంటే చేతులతో ఆస్వాదిస్తూ తినే వాళ్లే వందేళ్లు హాయిగా బతుకుతారని నిపుణులు చెబుతున్నారు.

చేతులతో ఆస్వాదిస్తూ అన్నం తినడం వల్ల కండరాలకు పని పెరగడంతోపాటు బ్లడ్ సర్కులేషన్ బాగా ఉంటుంది. అంతేకాదు ఇలా తినడం వల్ల ఆహారంతో బంధం ఏర్పడుతుంది. దీని కారణంగా మనకు అన్నం విలువ తెలుస్తుంది. మరోవైపు ఆయుర్వేదం లో నోట్లోకి చేతివేళ్ల ద్వారా ఆహారాన్ని పంపించడానికి యోగముద్ర అని అంటారట.

అది జ్ఞాన అవయవాలను ఆక్టివేట్ చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థకు సంబంధించిన… రసాలను జీర్ణాశయంలోకి విడుదల చేయడంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అటు చేతులతో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా కొందరు చేతుల మీద అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని స్పూన్లు ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా మంది స్కూళ్లకు అలవాటు అయ్యారు. ఇకనైనా ప్రతి ఒక్కరు స్పూన్లు వదిలేసి చేతులతో ఆహారం తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news