వావ్.. అదిరే స్కీమ్.. భార్యాభర్తలు నెలకు రూ.10 వేలు పొందొచ్చు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వస్తూ ఉంటుంది. ఈ స్కీమ్స్ తో చాలా రకాల లాభాలని పొందవచ్చు. ఈ స్కీము తో భార్యాభర్తలు నెలకు రూ.10వేలు ని పొందొచ్చు. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు, వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్రం అటల్ పెన్షన్ యోజన ని తీసుకు వచ్చింది. ఈ స్కీము తో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఈ పథకాన్ని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా 2015 మే 9న కోల్‌కతా లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను మొదలు పెట్టారు.

అదే కాక ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరక్ష బీమా యోజన వంటి బీమా పథకాలను కూడా తీసుకొచ్చారు. అటల్ పెన్షన్ యోజన స్కీము తో చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వాళ్ళు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. 60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి కూడా డబ్బులు వస్తాయి. నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు హామీ ఇస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ స్కీము లో చేరొచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ ని అందుకోవచ్చు.

నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కీములో 18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చెయ్యాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చెయ్యాలి. నెలవారీ, క్వార్టర్లీ, అర్థ వార్షికం చొప్పున పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్స్ చేయొచ్చు. ఈ స్కీము కింద రూ.1000 పింఛన్ రావాలంటే నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చెయ్యాలి. నెలకి రూ.210 పెట్టాలి.త్రైమాసికంగా రూ. 626, అర్థవార్షికంగా రూ. 1,239 కంట్రిబ్యూట్ చెయ్యాలి. నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు ఇస్తారు. ఇలా భార్యాభర్తలకు రూ. 10 వేలు పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news