వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన అగ్రిగోల్డ్ బాధితులు

-

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు ఎమ్మెల్సీ ఇస్తా- జ‌గ‌న్‌
అమ‌రావతి (విజయనగరం): జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం కోరుకొండలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు ఆదివారం కలిశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటానికి బాసటగా నిలబడాలని కోరారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న జననేతను బలరాంపురం వద్ద ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంపై, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుపై వారు జననేతకు వినతిపత్రం అందజేశారు.

అదే విధంగా తనను కలిసిన విశ్వబ్రాహ్మణుల సమస్యలపై జననేత సానుకూలంగా స్పందించారు. విశ్వబ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నం. 272లో చట్టసవరణ చేస్తామని హామీ ఇచ్చారు. దొంగ బంగారం పేరుతో పోలీసుల వేధింపులు లేకుండా చట్టంలో మార్పు తీసుకొస్తామని అన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామని కూడా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news