అచ్చెన్నాయుడు టీడీపీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారా ? కింజరాపు ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉందా ? అంటే కొన్ని వార్తలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల బెయిల్ మీడియా జైలు నుంచి బయటకొచ్చిన అచ్చెన్న ఇప్పుడుప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు కూడా ఇటీవల విజయవాడ వచ్చి అచ్చెన్నని పరామర్శించారు. దీంతో అచ్చెన్న మళ్ళీ టీడీపీలో దూకుడుగా పనిచేయడానికి రెడీ అయ్యారని అర్ధమవుతోంది. కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో అచ్చెన్న పార్టీ మారిపోతున్నారని, ఇప్పటికే రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానిలు బీజేపీలోకి వెళ్లడానికి రెడీ అయ్యారని ప్రచారం వచ్చింది.
అయితే వారు తన బాబాయ్ నిర్ణయం కోసం ఆగారని వార్తలు వస్తున్నాయి. అటు జైలు నుంచి బయటకొచ్చిన అచ్చెన్న టీడీపీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారని, పైగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బాగోలేదని, బీజేపీలోకి వెళితేనే సేఫ్‌గా ఉండొచ్చని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం బయటకొచ్చింది. ఇక కింజరాపు ఫ్యామిలీ జంపింగ్ వార్తలతో టీడీపీ అధిష్టానం కలవరపడుతోందని, అందుకే ఎప్పటికప్పుడు అచ్చెన్నతో చినబాబు ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం ప్రచారానికే పరిమితం కానుందని, తమ్ముళ్ళు స్ట్రాంగ్‌గా చెబుతున్నారు.
మొదటి నుంచి కింజరాపు ఫ్యామిలీ టీడీపీకి వీర విధేయులని, అలాంటిది వారు పార్టీ మారడం అనేది జరగని పని అని చెబుతున్నారు. పైగా బీజేపీలోకి వెళితే ఎలాంటి భవిష్యత్ ఉండదని, ఏదో బీజేపీ హడావిడి తప్పా, పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు. అయినా కింజరాపు ఫ్యామిలీకి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అసలు అచ్చెన్న అసంతృప్తిగా ఉన్నారని లేనిపోని ప్రచారం చేస్తున్నారని, ఇదంతా టీడీపీని ఇబ్బంది పెట్టడానికి ఓ వర్గం వారు చేస్తున్న తప్పుడు ప్రచారమని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. కింజరాపు ఫ్యామిలీ టీడీపీని వీడే ప్రసక్తే లేదని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు.
ఒక్కటి మాత్రం నిజం. బలమైన బీసీ నేతగా ఉన్న అచ్చెన్న ఇన్ని రోజులు జైల్లో ఉన్నా బెయిల్ తీసుకురాకపోవడం చంద్రబాబుకు మైనస్ అయ్యింది. ఈ విషయంలో కింజారపు ఫ్యామిలీ కూడా అసంతృప్తిగానే ఉంది. దీనిపై టీడీపీ వర్గాలు అసంతృప్తితో ఉన్నయి. అందుకే చంద్రబాబు ఆయనకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించాలన్న ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చి ఈ అసంతృప్తిని గప్‌చుప్ చేసేయాలని చూస్తున్నారట.
-vuyyuru subhash