పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఉంటుందో…. పోతుందో : ధర్మపురి అర్వింద్‌

-

మరి కొన్ని రోజులలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్‌ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని ఆరోపించారు . కోమటిరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కుర్చీని లాక్కోవడానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడని ఆయన కామెంట్‌ చేశారు.

నిజామాబాద్‌ జిల్లా లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కవిత ఇద్దరూ ఒక్కటే అని.. ఇద్దరూ కలిసి నిజామాబాద్‌ అభ్యర్థిని నిర్ణయిస్తారని అన్నారు. రైతుబంధు నిధుల్లో కోమటిరెడ్డి రూ.2వేల కోట్లు, పొంగులేటి రూ.3వేల కోట్లు బిల్లుల కింద తీసుకున్నారని సంచల ఆరోపణలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. రాష్ట్రంలో 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news