బాలయ్య షోలో ప్రభాస్.. ఆ రహస్యాలను బయటపెడతారా..?

-

పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఎక్కువగా ఇంటర్వ్యూలకు హాజరవ్వడానికి ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ షో నిర్వాహకుల కోరిక మేరకు బాలయ్య పై ఉన్న అభిమానంతో ఈ షోకి ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ఈ షో కి హాజరైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఓకే ఫ్రేమ్లో ప్రభాస్ , బాలయ్యలను చూసి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాలి అని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ప్రభాస్ నుంచి ఎదురుచూస్తున్న సమాధానాలలో ఆయన పెళ్లి సమాధానం కూడా ఒకటి. ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారు అనే విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. ముఖ్యంగా ప్రభాస్ – అనుష్క మధ్య బంధానికి సంబంధించి వైరల్ అవుతున్న పుకార్లకు సైతం ప్రభాస్ ఈ షో ద్వారా చెక్ పెడతారు అని అభిమానులు భావిస్తున్నారు. పెదనాన్న కృష్ణంరాజు మరణం వల్ల కలిగే బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రభాస్ పెదనాన్న జ్ఞాపకాలను కూడా ఈ షో ద్వారా పంచుకునే అవకాశం కనిపిస్తుంది.

మరొకవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్, ప్రాజెక్టుకే, ఆది పురుష్ సినిమాలకు సంబంధించి వేగంగా అప్డేట్లను కూడా ఇస్తూ వస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ప్రభాస్ మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఎపిసోడ్ ద్వారా బాలయ్య ప్రభాస్ కి సంబంధించిన రహస్యాలను బయటపెడతారేమో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news