రజనీకాంత్ అభిమానులకి నిరాశ తప్పదా..?

-

తమిళనాడు ప్రజలు కోరుకున్న విధంగానే రాజకీయాలలోకి వస్తున్నానని మూడేళ్ల క్తితమే ప్రకటించిన సూపర్ స్టార్ రజనీ కాంత్, ఆ తర్వాత దానిపై ఎలాంటి కార్యచరణ ని ముందుకు తీసుకువెళ్ళలేదు. 2021 ఎన్నికలకి సిద్ధం అవుతానని చెప్పిన రజనీ, ఇప్పటికీ రాజకీయ ప్రవేశం పై ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఈ మేరకు చాలా మందిలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. రజనీ కాంత్ రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపడం లేదని మాట్లాడుకుంటున్నారు.

పార్టీ పెడతానని చెప్పి మూడేళ్లయినా ఆ విషయమై ఎలాంటి అడుగు ముందుకు పడకపోవడంతో ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. మరి రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న అభిమానులని నిరాశ పరుస్తాడా, లేదా ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసి, పార్టీ ప్రకటన తో వస్తాడా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news