బీజేపీ నేతల మీద బీర్ సీసాలతో దాడి !

వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అందజేస్తున్న పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని టీఆర్ఎస్ నాయకులు వారికి‌ తెలిసిన వారికి మాత్రమే ఇస్తున్నారని, ఇతర వరద బాధితులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అదే ఆరోపణలతో నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.

వరద బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి వరద బాధితులకు పరిహారం అందించే వరకూ పోరాడతామని అంటూ నినాదాలు చేశారు. అయితే రోడ్డు పై బైటాయించిన భాజపా నాయకులను, వరధ బాధితులను అక్కడనుంచి పోలీసు స్టేషన్ తరలించారు. అయితే ఈ భాజపా నాయకులను, వరధ బాధితులను పోలీసులు వదిలేశాక వారి మీద దాడి జరిగినట్టు సమాచారం. తమ మీద బీరు సీసాలు, రాళ్లతో దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.