బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. గత వారం అవినాష్ ఎలిమినేట్ అవడంతో హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆరుగురిలో నుండి వచ్చే వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాబోయే బిగ్ బాస్ విన్నర్ ఎవరా అనే విషయమై తమ అభిమాన కంటెస్టెంట్లకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి తన మద్దతు తెలియజేసాడు. తనని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయినా ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ టైటిల్ గెలవాలని కోరుతున్నాడట. నిజానికి బిగ్ బాస్ ని తాను ఫాలో అవ్వడట. కానీ ఆరియానా గ్లోరీ హౌస్ ఉండడంతో ఆమె గెలిస్తే బాగుంటుందని అన్నాడు. మరి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఫేమస్ అయిన ఆరియానా గ్లోరీ, ఆయన మద్దతుతో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటుందా లేదా చూడాలి.