కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటా చేస్తారా? : కేసిఆర్

-

కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటా చేస్తారా?మీరు జైల్లో పెడుతారా.. మీ జైలకు తోకమట్టకు బెదిరేదిలేదు అని మండిపడ్డారు. మిర్యాలగూడ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్.పదిహేను ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి.. పదేండ్లు అభివృద్ధి చేసిన నన్ను పట్టుకుని పేగులు తీస్తాం.. మెడలేసుకుంటాం అంటారా? అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడే భాష ఇదేనా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలకు పంగనామం పెట్టిందని మాజీ సీఎం కేసిఆర్ అన్నారు. ‘నన్ను జైల్లో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైళ్లకు నేను భయపడతానా? భయపడితే తెలంగాణ వచ్చేదా? మంత్రులు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఇనుము కూడా ఇవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ అసమర్థులు కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు’ అని కేసిఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news