ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయి : పవన్ కళ్యాణ్

-

అమరావతికి 35 వేల ఎకరాలు కాదు 55 వేల ఎకరాలు కావాలన్న జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నాడు, ఉత్తరాంధ్ర వెనుకబడుతుందన్నాడు కానీ ఈ రోజుకి మన రాష్ట్రానికి రాజధాని లేదు అని మండిపడ్డారు.నెల్లిమర్ల వారాహి విజయభేరి బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయి, విజయనగరం వలసలకు మారు పేరయింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.విజయనగరం, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, పరిశ్రమలు రావాలి, యువతీ యువకులకు ఉపాధి హామీలు రావాలి. అదే ఆలోచనతో నేను పొత్తుని ప్రకటించాను అని తెలిపారు. చంద్రబాబు గారిని చాలా కఠినమైన పరిస్థితుల్లో చూసా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో..కానీ ఎలాంటి బెరుకు లేకుండా కనపడ్డారు.జగన్ సైకోపాత్ తో పాటు సోసియో పాత్..ఎవ్వరు నవ్వినా, తెల్లబట్టలు వేసుకున్నా, సంతోషంగా ఉన్నా చూడలేడు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news