మందుబాబులకు షాక్ ; రేపు, ఎల్లుండి వైన్స్ బంద్

-

వినాయక నిమజ్జనం నేపథ్యం లో అన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా 55 స్టాస్టిక్ క్రైన్స్ ఏర్పాటు చేశామని… 50 అంబులెన్స్ లను కూడా నగరంలో అలెర్ట్ చేసి ఉంచామన్నారు. సిపి కార్యాలయం లో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని… మహిళ భద్రత కోసం అడిషనల్ సిపి షికాగోయల్ నేతృత్వం లో షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక నగరం లో రేపు, ఎల్లుండి వైన్ షాప్ లు తెరవడానికి అనుమతి లేదని హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్‌.

రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌, బార్లు, పబ్బులు మూసివేయాలన్నారు. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే.. . చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ ఉత్సవ సమితి వాలంటరీ సభ్యులు ద్వారా నిమజ్జనం శాంతి యుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని… ఖైరతాబాద్ గణేష్ 2.5 కిలో మీటర్ల పొడవునా శోభాయాత్ర కొనసాగునుందన్నారు.
క్రైన్ నెంబర్ 4 లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. గణేష్ నిమజ్జనం లో ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే 9490598985, ల్యాండ్ లైన్ 040 27852482 నంబర్స్ కి చెయొచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news