‘సైమా 2022’ లో దుమ్ము లేపిన “పుష్ప”..టాలీవుడ్ కు వచ్చిన అవార్డులు ఇవే

-

మన దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రెస్టేజియస్ అవార్డ్స్ లో సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కూడా ఒకటి. మరి ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ అవార్డుల వేడుక ఈసారి కూడా ఎంతో ఘనంగా ఇండియన్ సినిమా దగ్గర ఎందరో బిగ్ స్టార్స్ హాజరు అయిన సమక్షంలో నిన్న బెంగుళూరు లో జరిగింది.

అయితే ఈ అవార్డ్స్ ఎంపిక పోల్స్ ద్వారా జరగగా మన తెలుగు సినిమాల్లో గత ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో అనేక అంశాల్లో పలు చిత్రాలు అవార్డులు సాధించాయి. మరి ఈ చిత్రాల్లో అయితే దాదాపు అన్ని వర్గాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన పుష్ప దుమ్ము లేపింది ఇక ఈ మొత్తం లిస్టు ఒకసారి పరిశీలించినట్లు అయితే.

ఉత్తమ చిత్రం: పుష్ప: ది రైజ్ (మైత్రి మూవీ మేకర్స్)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ నటి: పూజా హెడ్గే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)

ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)

ఉత్తమ సంగీత స్వరకర్త: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)

ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (శ్రీవల్లి – పుష్ప: ది రైజ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిరియాల (చిట్టి – జాతి రత్నాలు)

ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (జై బాలయ్య – అఖండ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)

ఉత్తమ తొలి నటుడు: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

ఉత్తమ తొలి నటి: కృతి శెట్టి (ఉప్పెన)

ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చి బాబు సన (ఉప్పెన)

ఉత్తమ తొలి నిర్మాత: సతీష్ వెగ్నేస (నాంధి)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)

ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

Read more RELATED
Recommended to you

Latest news