రేపటి నుంచి డిసెంబరు 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు

-

రేపటి నుంచి డిసెంబరు 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే “వక్ఫ్‌ సవరణ బిల్లు-2024”, “ఒక దేశం-ఒకే ఎన్నిక” బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలనే సంకల్పంతో ఉంది మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం, “పార్లమెంటరీ సంయుక్త కమిటీ” “వక్ఫ్‌ సవరణ బిల్లు-2024” పరిశీలనలో ఉంది.

ఈ వివాదస్పద బిల్లులు పై వివిధ రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా సంబంధిత వర్గాలను సంప్రదించి, వారి అనుమానాలను నివృత్తి చేసి, ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయనుంది “పార్లమెంటరీ సంయుక్త కమిటీ” (జేపీసీ). ఈ రెండు బిల్లులను తీవ్రంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని “ఇండియా” కూటమి వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల పై కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో ఏర్పాట్లను ఇటీవల స్వయంగా పరిశీలించారు లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా.

Read more RELATED
Recommended to you

Latest news