రజనీకాంత్ కు సూపర్ స్టార్ బిరుదు ఏ సినిమాతో వచ్చిందంటే…

-

తమిళంలో సూపర్ స్టార్ ఎవరు అంటే రజనీకాంత్ అని టక్కున చెబుతారు అయితే ఆయనకి అసలు సూపర్ స్టార్ అనే బిరుదు ఎప్పుడు వచ్చిందంటే..

రజనీకాంత్ అనే పేరు వెనక ఆయన అభిమానులకు చెప్పుకోలేనంత ఎమోషన్ ఉంటుంది అభిమానులు ఆరాధ్య దైవంగా భావించే రజినీకాంత్ వ్యక్తిగతంగా కూడా ఎందరో మనసులు గెలుచుకున్నారు సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలకు తిరిగి డబ్బులు ఇచ్చేంత ఔదార్యం ఉన్న హీరో రజనీకాంత్.. బస్సు కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎప్పటికీ చెప్పుకోదగినది తమిళం తెలుగు కన్నడ మలయాళం హిందీ ఇలా ప్రతి భాషలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రజనీకాంత్ ముఖ్యంగా తన స్టైల్ డైలాగ్ డెలివరీతో దేశ విదేశాల్లో సైతం అభిమానుల్ని సంపాదించుకున్నారు.. సూపర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన రజినీకాంత్ కు సూపర్ స్టార్ అనే బిరుదు ఎప్పటినుంచి వచ్చిందంటే..

1975లో ‘అపూర్వరాగంగళ్‌’ అనే చిత్రంతో తరంగేటరం చేశారు ఆ తర్వాత కన్నడలో సంగమ అంతులేని కథ చిత్రాల్లో నటించారు ఇవే ఆయన మొదటిగా నటించిన మూడు చిత్రాలు అప్పటినుంచి 1978 వరకు సుమారు ఈ మూడేళ్లలోనే 21 పైగా చిత్రాల్లో నటించారు రజనీకాంత్… ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా హిట్ తో ఆయన పేరు ముందు సూపర్ స్టార్ అనే బిరుదు స్థిరపడిపోయింది..

Read more RELATED
Recommended to you

Latest news