రిటైర్మెంట్‌పై మెస్సి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

ఫిఫా ప్రపంచ కప్‌ విజయం తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు పలుకుతాడని భారీగా ప్రచారం జరిగింది. కానీ ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు మెస్సి. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. రిటైర్మెంట్‌ ఇప్పట్లో లేనట్లే అని తేల్చిచెప్పాడు. డిసెంబర్‌ 18న నరాలు తెగే ఉత్కంఠ మధ్య అర్జెంటీనాకు ఈ సాకర్‌ మాంత్రికుడు అద్భుత విజయాన్నందించాడు.

‘‘నేను నా కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకొన్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో అందనది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. నేను కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం తీవ్రంగా పోరాడాను. నా కెరీర్‌ చరమాంకంలో దీన్ని సాధించాను. కానీ నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరికొన్ని గేమ్స్‌ ఆడాలనుకుంటున్నాను’’ అని మెస్సి చెప్పాడు.

మరోవైపు ఇన్‌స్టాలో కూడా మెస్సి తన విజయాన్ని పంచుకున్నాడు. ‘ప్రపంచ ఛాంపియన్‌ కావాలని చాలా సార్లు కలలుగన్నాను. సాధించలేకపోయాను. కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికి ధన్యవాదాలు. అర్జెంటీనా సమష్టిగా పోరాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలదని మరోసారి నిరూపించాము. వ్యక్తుల కంటే ఎక్కువగా ఈ ఘనత జట్టుకే చెందుతుంది. అర్జెంటీనా వాసుల కల కోసం సమష్టిగా పోరాడటంలో ఉన్న బలం ఇది’’ అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news