ఎస్‌బీఐ ఏటీఎం రూల్స్ మారాయి.. క్యాష్ విత్‌డ్రా చేసేముందు ఇది తెలుసుకోండి..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌న ఏటీఎం రూల్స్‌కు మార్పులు చేర్పులు చేసింది. ఇక‌పై అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకుండా ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేస్తే ఆ ట్రాన్సాక్ష‌న్ ఫెయిల్ అయితే చార్జిల‌ను వ‌సూలు చేయ‌నుంది. అలా ఒక ట్రాన్సాక్ష‌న్‌కు రూ.20తోపాటు జీఎస్‌టీ అదనంగా క‌లిపి చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. ఈ మేర‌కు ఈ కొత్త రూల్‌ను ఎస్‌బీఐ తాజాగా అమ‌లు చేస్తోంది.

withdrawing cash in sbi atms then you should know these changed rules

ఇక నెల‌కు నిర్దేశించిన ఏటీఎం లావాదేవీలు పూర్తి అయితే ఆ త‌రువాత చేసే ట్రాన్సాక్ష‌న్ల‌కు కూడా ఎస్‌బీఐ చార్జిల‌ను వ‌సూలు చేస్తుంది. ఫైనాన్షియ‌ల్‌, నాన్ ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఆ చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. అవి రూ.10 నుంచి రూ.20 మ‌ధ్య‌లో ఉంటాయి. వీటికి జీఎస్‌టీ అద‌నంగా చెల్లించాలి.

ప్ర‌స్తుతం ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ క‌స్ట‌మ‌ర్ల‌కు మెట్రో సిటీల్లో అయితే నెల‌కు 8 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఫ్రీగా ఇస్తున్నారు. అందులో 5 ట్రాన్సాక్షన్ల‌ను ఎస్‌బీఐ ఏటీఎంల‌లో, 3 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఇత‌ర ఏటీఎంల‌లో ఉచితంగా చేసుకోవ‌చ్చు. నాన్ మెట్రో సిటీల్లో అయితే ఏటీఎం ట్రాన్సాక్ష‌న్ల ప‌రిమితి 10 గా ఉంది. వీటిల్లో ఎస్‌బీఐ ఏటీఎంల‌లో 5, ఇత‌ర ఏటీఎంల‌లో 5 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఉచితంగా చేసుకోవ‌చ్చు. ఆ ప‌రిమితి దాటితే చార్జిల‌ను వ‌సూలు చేస్తారు.

ఇక రూ.10వేల‌కు మించి ఎస్‌బీఐ ఏటీఎంల‌లో తీస్తే అందుకు పిన్‌తోపాటు రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీని కూడా క్యాష్ విత్‌డ్రా స‌మ‌యంలో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ‌ల‌ను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఎస్‌బీఐ అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news