ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం తో…మహిళ అరెస్ట్!

-

కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాలు గట్టి చర్యలే చేపడుతున్నాయి. ఈ వైరస్ విషయంలో ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మాత్రం వారిని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కోల్ కతా కు చెందిన ఒక మహిళా కరోనా కేసుల గురించి తప్పుడు సమాచారాన్ని వాట్సాప్ లో షేర్ చేసింది అన్న నేపథ్యంలో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కోల్ క‌తాలోని న్యూఅలిపోర్ ఏరియాలో 15 మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని, టెస్టుల్లో పాజిటివ్ అని వ‌చ్చినా కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదంటూ ఓ ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసింది. అంతటితో ఆగకుండా ఈ ఫేక్ మెసేజ్ ను స్నేహితులతో పాటు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కు కూడా ఆమె షేర్ చేసిందట. దీంతో ఒక వాట్సాప్ గ్రూప్ లోని మెంబ‌ర్ పోలీసుల‌కు ఈ విష‌యం చెప్ప‌డంతో ఆమెపై కేసు న‌మోదు చేసి.. అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా లో ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తే ఊరుకొనేది లేదని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సార్లు ప్రకటించినప్పటికీ ప్రజలు మాత్రం ఇలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. దానిఫలితంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఆ మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు హచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం తో పలు రాష్ట్రాల్లో పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1251 కరోనా కేసులు నమోదు కాగా, 32 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news