తెలంగాణా లో పెరుగుతున్న మరణాలు…అంతా నిజాముద్దీన్ ప్రార్ధనల వల్లేనట!

-

ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో చాలామందికి ఈ కరోనా పాజిటివ్ రావడం తో అధికారులు మరింత అప్రమత్తమౌతున్నారు. అయితే ఈ పార్థనలకు హాజరైన వారిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు తెలుస్తుంది. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్‌లో, ఒకరు గద్వాలలో మరణించడం తో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరందరూ కూడా కరోనా వైరస్ సోకే చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ నెల మార్చి 13 నుంచి 20 వరకు ఢిల్లీ లోని మర్కజ్ లో మతపరమైన ప్రార్ధనలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి పలువురు హాజరవ్వగా,తెలంగాణా నుంచి కూడా చాలా మంది హాజరైనట్లు తెలుస్తుంది. ఐతే మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో చాలా మంది కరోనా పాజిటివ్ వస్తోంది. కొంత మంది తమకు వ్యాధి సోకిందన్న విషయం తెలియకుండానే చనిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆరుగురు మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఇతరులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోన అనుమానితులను ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన తెలంగాణ వారిలో కొందరికి కరోనా వైరస్ సోకడం తో వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని తెలిపారు. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని అధికారులను సూచిస్తున్నారు. ఇక కరీంనగర్‌లో కలకలం రేపిన ఇండోనేసియన్లు కూడా ఢిల్లీ ప్రార్థనలకే వెళ్లి వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలను కూపీ లాగుతోంది. వారెవరో బయపడితే కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news