వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయట పడిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో న్యూడ్ గా ఉన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ఆ మహిళతో మాట్లాడుతున్నాడు. మహిళతో శృంగారానికి సంబంధించిన విషయాలను మాట్లాడినట్లు రికార్డు అయింది. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖచిత్రంతో వైరల్ అవుతున్న న్యూడ్ వీడియో ఆయనదేనా? లేదంటే గిట్టని వాళ్ళు చేసిన మార్ఫింగ్ మాయా? ఎంపీ నగ్నచిత్రంపై పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో..ఈ వీడియోలపై ఎంపీ గోరంట్ల మాధవ్ క్లారిటీ ఇచ్చారు. వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రమని.. ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు.
అయితే తాజాగా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో ఆయన పక్కన తన ఫోటో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అనిత రెడ్డి సత్య సాయి జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నాలుగేళ్లుగా వైసిపి కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అందుకే టిడిపి వాళ్లు తనని టార్గెట్ చేశారని పేర్కొంది. మాధవ్ పక్కన తన ఫోటో పెట్టి మార్ఫింగ్ చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.