బంగారు తెలంగాణలో బతకడమే పాపం చేసావని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. నిన్న మెదక్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై షర్మిల స్పందించారు. ఈ రైతు సెల్ఫీ వీడియో KCR దౌర్భాగ్య పాలనకు నిదర్శనం. తాతల తండ్రుల నుంచి పోడు చేసుకొంటున్న భూములను లాక్కొంటే, దొర పాలనలో మాకు బతుకు లేదని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్న ఆదివాసీ మహిళలను, పసిపిల్లల తల్లులను జైల్లో పెట్టించావని ఆగ్రహించారు. ఇవాళ రైతుల భూములు లాక్కొని చచ్చేలా చేస్తున్నావ్. వందల మంది విద్యార్థులు చస్తే కానీ నీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదు. ఇప్పుడు ఎంతమంది ఆదివాసీలను చంపితే నీకు పోడు భూములకు పట్టాలివ్వాలని సోయి వస్తుంది?బంగారు తెలంగాణ లో బతకడమే పాపం చేసావ్. ఆత్మహత్యలే దిక్కు చేసావని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.
ఈ రైతు సెల్ఫీ వీడియో KCR దౌర్భాగ్య పాలనకు నిదర్శనం. తాతల తండ్రుల నుంచి పోడు చేసుకొంటున్న భూములను లాక్కొంటే,
దొర పాలనలో మాకు బతుకు లేదని
సెల్ఫీ వీడియో తీసుకొని మరీ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మొన్న ఆదివాసీ మహిళలను, పసిపిల్లల తల్లులను జైల్లో పెట్టించావ్. 1/2 pic.twitter.com/UgYpNEw6xT— YS Sharmila (@realyssharmila) August 8, 2022