ట్రంక్ పెట్టెలో యువతి శవం.. ప్రతీ సీన్ క్లైమాక్స్ లానే ఉంది.. ఫైనల్ గా ఏం జరిగిందంటే..

-

సస్పెన్స్ స్టోరీస్ అంటే మీకు ఇష్టమైనా.. చదివే ఓపిక ఉంటే.. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. ఏ సస్పన్స్ సినిమాకు తీసిపోదు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంటుంది. మిస్ కాకుండా.. మొత్తం చదివేయండి. మరీ.. ఇంకెందుకు ఆలస్యం.. స్టోరీలోకి వెళ్లిపోదామా..

అది 1871 ఆగస్ట్ 26. మధ్యాహ్నం.. అమెరికా… న్యూయార్క్ – మాన్‌హట్టన్‌లోని హడ్సర్ రివర్ రైల్ బోర్డ్ డిపో దగ్గర విపరీతమైన వాసన వస్తుంది. ఏ కుక్కో, పిల్లో చచ్చిపోయి ఉంటుందిలే అనుకున్నారు.. కానీ ఆ కంపు.. ఓ ట్రంకు పెట్టేలోంచి వస్తుంది..అది చికాగోకి రవాణా అవ్వాల్సిన పెట్టె. లగేజీని చూసుకునే బ్యాగేజ్ మాస్టర్‌కి ఈ విషయాన్ని చెప్పాడో వ్యక్తి. వెంటనే ఆ మాస్టర్.. తన మనుషులకు ఆదేశమిచ్చాడు. ఆ దుర్వాసన సంగతేంటో చూడమన్నాడు. ఓ నలుగురు వ్యక్తులు వెళ్లి… ట్రంక్ పెట్టను బలవంతంగా తెరచి చూశారు. లోపల ఓ దుప్పటి కప్పి ఉంది. దాన్ని తీశారు.. ఓ అందమైన యువతి అందులో ఉంది. ఆమె జుట్టు బంగారం రంగులో మెరిసిపోతుంది…నగ్నంగా చనిపోయి ఉంది.
ట్రంక్ పెట్టెను ఎవరు తెచ్చారు అని డెలివరీ బుక్ లో చూశారు.. డీటేల్స్ ఏం లేవు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.

పిల్లాడు ఇచ్చిన క్లూ..

ఎలాంటి క్లూ దొరక్క సతమతవుతున్న పోలీసుల దగ్గరకు ఓ 12 ఏళ్ల పిల్లాడు అలెగ్జాంజర్ వచ్చాడు.. తాను న్యూస్ పేపర్లు వేస్తానని.. తను హడ్సర్ రివర్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఓ మహిళ అతని దగ్గరకు వచ్చింది. అక్కడికి కాసేపట్లో తన ట్రంక్ పెట్టె వస్తుందనీ… దాన్ని కాస్త చూడమని చెప్పింది. ఆ తర్వాత టికెట్ ఎక్కడ అమ్ముతారు అని అడిగిందని.. ఓ కిటికీ వైపు చూపించి… అక్కడ అమ్ముతారు అని చెప్తే.. దాంతో ఆమె అటువైపు బయలుదేరిందని.. అంతలో ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెను తెచ్చాడు. దాన్ని ఫ్రైట్ ఆఫీసులోకి తీసుకెళ్లాల్సి ఉంది. అందుకు తానే సాయం చేశానని…పోలీసులకు ఆ కుర్రాడు చెప్పాడు.

ట్రిప్ కోసం వెతికితే ట్రాప్ దొరికాడు..

పోలీసులు… ఆ ట్రంక్ పెట్టెను ఏ వ్యక్తి తెచ్చాడో చెప్పగలవా అని అడిగితే… అలెగ్డాంజర్.. పెట్టెను తెచ్చిన వ్యక్తి తన పేరును ట్రిప్ (tripp) అని ఓ పక్కన రాశాడు అని చెప్పాడు. వెంటనే పోలీసులు.. ట్రిప్ అనే పేరుగల డెలివరీ బాయ్ కోసం వెతుకడం మొదలుపెట్టారు.. ఆ రోజు గడిచిపోయింది. అర్థరాత్రి ఒంటిగంట అయ్యింది. ఆ సమయంలో ఓ ట్రక్‌మాన్‌ని ఎవరో ట్రాప్ అని పిలవడం పోలీసులు విన్నారు. అతని దగ్గరకు వెళ్లి నీ పేరేంటి అని అడిగితే… ట్రాప్ అని చెప్పాడు. దొరికాడు అనుకుంటూ పోలీసులు అతన్ని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడున్న 12 ఏళ్ల అలెగ్జాండర్… అతన్ని చూసి… “నేను చెప్పింది ట్రిప్… మీరు తెచ్చిన వ్యక్తి పేరు ట్రాప్” అని చెప్పాడు. దాంతో తమకు కావాల్సిన వ్యక్తి అతను కాదని పోలీసులు అతన్ని వదిలేశారు.

పోస్ట్‌మార్టం‌లో తెలిసిన అసలు విషయం..

ట్రంక్ పెట్టె వస్తుందని అలెగ్జాండర్‌కి చెప్పిన అమ్మాయి ఎవరో కూడా పోలీసులకు తెలియలేదు. అప్పట్లో రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు లేవు కాబట్టి పోలీసులకు ఆమె ఎవరో తెలుకోవడం కష్టమైంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో, టికెట్ కొన్నాదో లేదో కూడా తెలియలేదు. ఆ ట్రంక్ పెట్టెను పోలీసులు… బెల్లెవ్యూ ఆస్పత్రిలోని డెడ్ రూమ్‌కి తీసుకెళ్లారు. డెడ్ బాడీ గట్టిపడిపోయింది. బాడీ పార్టులు పెట్టెలో ఎలా ఇరుక్కున్నాయో… బయటకు తీశాక కూడా అలాగే ఉండిపోయాయి. ఆమె బతికివున్నప్పుడే బలవంతంగా పెట్టెలో కుక్కినట్లున్నారు అని డాక్టర్లు తెలిపారు..ఆమె గర్భవతి అనీ… బలవంతంగా అబార్షన్ చేయించడం వల్ల చనిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది.

సెకండ్ అవెన్యూ నుంచి వచ్చిన పెట్టె:

యువతి శవం కనిపించిన రెండు రోజుల తర్వాత… పోలీస్ స్టేషన్‌కి విలియం పికెట్ అనే ట్రక్‌మాన్ వచ్చాడు.. నేను పేపర్‌లో చూశాను. మీరు ట్రిప్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నారని. అది నేనే అని చెప్పాడు. అలెగ్జాండర్ అతన్ని చూసి.. అవును… ఇతనే ఆ పెట్టెను తెచ్చాడు అని చెప్పాడు. వెంటనే పికెట్… “నేను ఆ ట్రంక్ పెట్టెను డిపో దగ్గరకు తెచ్చేందుకు ఓ మహిళ నాతో డీల్ కుదుర్చుకుంది. సెకండ్ అవెన్యూ దగ్గర ఓ అడ్రెస్ నుంచి డిపో వరకూ పెట్టెను తెచ్చాను” అని చెప్పాడు. సెకండ్ అవెన్యూ దగ్గర నువ్వు ఆ పెట్టెను ఏ అడ్రెస్ నుంచి తెచ్చావు అని పోలీస్ సెర్జెంట్ రూనీ అడిగితే… పికెట్ ఓ అడ్రెస్ చెప్పాడు. వెంటనే రూనీ… ఆ అడ్రెస్‌ గల ఇల్లు జాకోబ్ రోసెంజ్‌వీగ్‌ది అని గుర్తించాడు.

అసలు… ఎవరీ జాకోబ్ రోసెంజ్‌వీగ్:

ఇతను అబార్షన్లు చెయ్యడంలో స్పెషలిస్ట్. ఇదివరకు బీర్ సెలూన్ నడిపేవాడు. దాని కంటే అబార్షన్ల ద్వారా ఎక్కువ డబ్బు వస్తుందని ఈ దందా మొదలుపెట్టాడు. అతనికి న్యూయార్క్‌లో ఐదు అబార్షన్ కేంద్రాలున్నాయి. 1871లో అతను తన కుటుంబంతో కలిసి సెకండ్ అవెన్యూలో ఉండేవాడు. అతని ఆఫీసు… అమిటీ స్ట్రీట్‌లోని ఫిఫ్త్ అవెన్యూలో ఉంది. అక్కడ అతను డాక్టర్ అస్చెర్ పేరుతో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాను రష్యన్ అని ఓసారి చెప్పిన జాకోబ్… చూడటానికి పోలాండ్ వాసిలా ఉంటాడు. అతను మాట్లాడే యాస… జర్మనీ వ్యక్తిదిలా ఉంటుంది.

అబార్షన్లకు అనుమతి:

1871 కాలంలో న్యూయార్క్‌లో అబార్షన్లకు చట్టబద్ధత లేదు. పిండంలో కదలిక రాకముందు చెయ్యవచ్చు. అప్పట్లో అబార్షన్లు చాలా ఎక్కువగా జరుగుతుండటంతో… వాటిపై చట్టం తేవాలనే డిమాండ్ ఉండేది. అప్పట్లో తాము అబార్షన్లు చేస్తామని డజన్ల కొద్దీ డాక్టర్లు… యాడ్స్ ఇచ్చేవాళ్లు. జాకోబ్ అలియాస్ అస్చెర్ కూడా యాడ్ ఇచ్చాడు. అతన్ని కలిసిన పోలీసులు… ట్రంక్ పెట్టెలో యువతి ఎవరు అని అడిగారు. తనకేమీ తెలియదన్నాడు. కానీ పోలీసులు… ట్రంక్ పెట్టెను రైల్వేస్టేషన్‌కి తెచ్చిన డెలివరీమేన్ విలియం పికెట్ (ట్రిప్) చెప్పిన మాటల ప్రకారం జాకోబ్‌ని అరెస్టు చేశారు.

బయటపెట్టిన సీక్రెట్ ఆపరేషన్ రిపోర్టర్:

ఆ యువతి ఎవరో కనిపెట్టేందుకు పోలీసులు… ఆమె శవాన్ని ఫొటోలు తీసి.. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లలా అంటించారు. దాంతో వందల మంది ఆమెను గుర్తు పడతామని వచ్చారు. కుళ్లిపోతున్న శవాన్ని చూశారు. కానీ ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. అయితే.. న్యూయార్క్‌లో కొన్ని నెలల కిందట ఓ మహిళతో కలిసి ఓ రిపోర్టర్… అబార్షన్లపై సీక్రెట్ ఆపరేషన్ చేశాడు. అతను అబార్షన్లు చేసే డాక్టర్లను రహస్యంగా కలిశాడు. తనతో ఉన్న మహిళకు సీక్రెట్‌గా అబార్షన్ చెయ్యాలని వాళ్లను కోరాడు. తద్వారా ఈ తంతు ఎలా జరుగుతోందో తెలుసుకోవాలని స్కెచ్ వేశాడు ఆ రిపోర్టర్.. అతను జాకోబ్‌ని కలిసినప్పుడు.. బంగారురంగులోని జుట్టుతో ఉన్న ఓ యువతిని చూశాడు. అతను శవాన్ని చూడటానికి వచ్చి… తాను ఆ రోజు జాకోబ్ దగ్గర చూసిన యువతీ… చనిపోయిన యువతీ ఇద్దరూ ఒకటే అని చెప్పాడు.

ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు..

రిపోర్టర్ చెప్పిన దాని ప్రకారం… ఆ యువతి జాకోబ్‌ని కలిసిందని తేటతెల్లమైంది… అందువల్ల జాకోబ్ చేసిన అబార్షన్ వల్లే ఆమె చనిపోయింది అనుకోవచ్చు. కానీ జాకోబ్.. తనకు ఆమె ఎవరో తెలియదు అంటున్నాడు కాబట్టి… ఆమె ఎవరన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో… పోలీసులకు మరో క్లూ దొరికింది. న్యూజెర్సీ… పాటెర్సన్‌కి చెందిన ఫిజీషియన్ డాక్టర్ థియోడోర్ కిన్నే… డెడ్ బాడీని చూసేందుకు వచ్చాడు. ఆమె ఎవరో తనకు తెలుసు అన్నాడు. వెంటనే వెళ్లి… డాక్టర్ జోసెఫ్ పార్కర్‌ని పోలీసుల దగ్గరకు తీసుకొచ్చాడు. కిన్నేతోనే కలిసి పనిచేస్తున్నారు పార్కర్ కూడా. కిన్నే యువతి శవాన్ని పార్కర్‌కి చూపిస్తూ… ఆమె అలీస్ బౌల్స్‌బీ… పార్కర్ పేషెంట్ అని పోలీసులకు చెప్పారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే… అలీస్ బౌల్స్‌బీ ఎడమ ఎల్బో (మణికట్టు)కి తాను చేసిన వాక్సినేషన్ స్కార్ (మచ్చ)ను చూసి గుర్తుపట్టానని తెలిపారు. అదే సమయంలో ఆమెను చూస్తూ… తాను ఆమెకు రెండు అదనపు దంతాలను అమర్చాననీ, అలాగే సరిగా లేని ఓ దంతాన్ని సరిచేశానని పోలీసులకు పార్కర్ తెలిపారు.

అలీస్ బౌల్స్‌బీ:

కిన్నే, పార్కర్ చెప్పినదాన్ని బట్టీ ఆమె పేరు.. అలీస్ బౌల్స్‌బీ అని తేలింది. వెంటనే పోలీసులు… జాకోబ్ ఇంటిని మరోసారి పరిశీలించారు. అక్కడ లాండ్రీలో ఓ హ్యాండ్ కర్చీఫ్ దొరికింది. దానిపై ఏవో అక్షరాలు ఉన్నాయి. బూతద్దంతో వాటిని చూశారు. ఏ ఏ బౌల్స్‌బీ అని రాసివుంది. దాన్ని జాకోబ్‌కి తెచ్చి చూపించారు. జాకోబ్ తెలియదనే చెప్పుకొచ్చాడు. అలీస్ బౌల్స్‌బీ తల్లిని కలిసిన పోలీసులు… కూతురి మరణ వార్త చెప్పగానే… తల్లి కుప్పకూలింది. వారం నుంచి తన కూతురు కనిపించట్లేదనీ, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని బోరున విలపించింది.

ఆత్మహత్య:

ఎప్పుడైతే పోలీసులు అలీస్ బౌల్స్‌బీ తల్లిని కలిశారో… ఆమెను వశపరచుకున్న వాల్టర్ కాంక్లిన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతని తండ్రికి సిల్క్ మిల్లు ఉంది. అందులో వాల్టర్.. క్లర్కుగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో… తోటి వర్కర్లు… అలీస్ బౌల్స్‌బీ కేసు గురించి మాట్లాడుకోవడం విన్నాడు. అంతే అతనికి భయం వేసింది. వెంటనే సిల్క్ దారాలను స్టోర్ చేసే గదిలోకి వెళ్లాడు. తలుపు వేశాడు. తర్వాత గన్ నుంచి బుల్లెట్ దూసుకెళ్లిన శబ్దం వర్కర్లకు వినిపించింది. “నేను చేయరాని తప్పు చేశాను. ఈ విషయం బయటకు వస్తుంది. అది నా కుటుంబానికి చెడ్డపేరు తెస్తుంది. అది నేను భరించలేను. అందుకే నాకు నేను ఈ శిక్ష వేసుకుంటున్నాను” అని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు.

కోర్టులో కేసు మలుపులు:

చనిపోయిన యువతి ఎవరో తేలడంతో పోలీసులు 1871 అక్టోబర్‌లో తమ దగ్గరున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే.. జాకోబ్… అటార్నీ విలియం హోవేని తన తరపున కోర్టులో వాదించేందుకు నియమించుకున్నాడు. విలియం హోవే పవర్‌ఫుల్ లాయర్. కేసుల్ని తారుమారు చెయ్యడంలో దిట్ట. జాకోబ్‌ని అలీస్ బౌల్స్‌బీ కలిసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు అన్నాడు. బ్రూక్లిన్‌లోని అన్నే బౌల్స్‌బీ అనే మహిళ కోర్టులో హాజరై… తనకు జాకోబ్ కొన్నేళ్లుగా తెలుసనీ… ఆయన ఇంట్లో దొరికిన కర్ఛీఫ్ తనదేనని తెలిపింది. అలీస్ బౌల్స్‌బీ తల్లి… తన కూతురి శవాన్ని గుర్తుపట్టలేదు. ఆమెను వాల్టర్ కాంక్లిన్ చంపివుంటాడని అటార్నీ విలియం హోవే కోర్టులో వాదించాడు.

ఫ్రస్టేషన్లో బయటపడ్డ నిజం..

కేసును పక్కదారి పట్టించేందుకు విలియం హోవే ఎంతగా ప్రయత్నించినా… పోలీసులు పక్కాగా ఆధారాలు సమర్పించడమే కాదు… విలియం హోవే… నకిలీ పాత్రధారుల్ని సృష్టించారనీ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని తమ తరపు లాయర్ ద్వారా బలంగా వాదన వినిపించగలిగారు. అదే సమయంలో ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయిన జాకోబ్… “ఏం చెయ్యమంటారు… అబార్షన్ తేడా వచ్చి… ఇన్ఫెక్షన్ అయ్యి ఆమె చనిపోయింది… ఇందులో నా తప్పేముంది? ఒక్కోసారి అలా అవుతుంది… ఏ డాక్టరైనా ఇలాగే చేస్తారు” అంటూ నిజాన్ని చెప్పేశాడు. జాకోబ్ నిర్లక్ష్యం వల్లే బౌల్స్‌బీ చనిపోయిందని తేలడంతో… అతనికి సెకండ్ డిగ్రీ మర్డర్ కింద ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అతన్ని సింగ్ సింగ్ జైలుకు పంపారు.

అలా స్టోరీ ఎండ్ అయింది..

Read more RELATED
Recommended to you

Latest news