ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం.. వివరాలివే!

-

తాజా మాజీ మంత్రులందరికీ పార్టీ బాధ్యతల అప్పగిస్తున్నట్లు ప్రకటన చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారికీ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతలను బాలనాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి అప్పగించారన్నారు.

చీఫ్‌ విప్‌ పదవి కొల్పోయిన శ్రీకాంత్ రెడ్డికి అన్నమయ్య జిల్లా బాధ్యతలు అప్పగిస్తున్నామని.. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్‌కు చిత్తూరు జిల్లా బాధ్యతలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

చాలా కాలంగా పదవి గురించి ఎదురు చూస్తున్న మర్రి రాజశేఖర్‌కు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ పదవి ఇస్తున్నట్లు… కడప మేయరుకు వైఎస్సార్‌ జిల్లా బాధ్యతలు ఇచ్చామని స్పష్టం చేశారు. త్వరలోనే ఏర్పాటు కానున్న ప్రాంతీయ మండళ్లు.. జిల్లా స్థాయి మండళ్ల తరహా వ్యవస్థ ఉంటుందని.. ప్రాంతీయ, జిల్లా మండళ్ల ఛైర్మన్లుగా మరికొందరి అసంతృప్తులకు.. నేతలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news