ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఏకంగా ఒక ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఏకంగా ఒక మహిళ ప్రాణం పోవడానికి కారణం అయ్యారూ . నల్గొండ జిల్లా అడవిదేవుల పల్లి మండలం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాటు సారా అమ్ముతుంది అనే ఆరోపణలతో ఓ మహిళ ఇంటి పై దాడి చేసిన పోలీసులు సక్రి అనే మహిళను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన విషయాన్ని చెప్పకుండా పెన్షన్ ఇప్పిస్తామంటూ నమ్మించి సదరు మహిళాను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే 60 ఏళ్ల వయసున్న మహిళ అని కూడా చూడకుండా పోలీసులు మహిళను కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసుల దెబ్బలకు తాళలేక వృద్ధురాలు చివరికి ప్రాణాలు వదిలింది. ఇక పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం తో బంధువులు కుటుంబ సభ్యులు… పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సక్రి మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి మెల్లగా జారుకోవడం గమనార్హం.