వెంకీ మామ అభిమానులకు గుడ్ న్యూస్..?

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రా కంటెంట్ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళ్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇక రా కంటే సినిమా గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ గెటప్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కు జోడీగా ప్రియమని నటించబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ప్రారంభానికి ముందే మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి.

దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తయి చివరికి కొంత భాగం మిగిలి ఉన్న సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ అమలు కావడంతో షూటింగ్ కాస్త నిలిచిపోయింది. ఇటీవలే సినిమా షూటింగ్ లకు సంబంధించి అనుమతులు వచ్చిన నేపథ్యంలో త్వరలో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది అనే అర్థమవుతుంది. నవంబర్ మొదటివారంలో… మిగిలిన చిత్రీకరణ సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రా కంటెంట్ సినిమాగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ సినిమా నారప్ప అన్న విషయం తెలిసిందే.