కరోనా ఐసోలేషన్ వార్డులో ఒక వైద్యుడు అత్యాచారం చేశాడని మరియు డిశ్చార్జ్ అయిన వెంటనే మరణించాడని ఒక మహిళ ఆసుపత్రి మంచం మీద పడుకున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జాతీయ మీడియా ఆరా తీసింది. ఇది తప్పుడు ప్రచారం అని గుర్తించారు. వైరల్ ఫోటో లో ఉన్న టీనేజ్ బాలికను జూన్ 2017 లో ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఆసుపత్రిలో వార్డు బాలుడు అత్యాచారం చేశాడు.
16 ఏళ్ల విద్యార్థి ఒక పార్టీలో అనారోగ్యానికి గురి కావడంతో ఆమె ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరింది. అయితే బట్టలు తడిచి ఉండటంతో మార్చాలని కోరగా ఆమెను వాష్ రూమ్ కి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి దిగాడు. ఆమెకు మత్తు పదార్ధం ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, బీహార్‌లోని గయాలో మరో కేసు నమోదైంది, కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన…
ఒక వలస కూలీ మహిళను ఆరోగ్య కార్యకర్త లైంగిక వేధింపులకు గురి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 25 ఏళ్ల బాధితురాలు గర్భస్రావం తరువాత తన భర్తతో కలిసి పంజాబ్లోని లుధియానా నుండి గయాకు తిరిగి వచ్చింది. అధిక రక్తస్రావం జరిగిందని మహిళ చెప్పడంతో మార్చ్ 27 న అనూగ్ర నారాయణ మగధ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ANMMCH) లో అత్యవసర వార్డులో చేర్పించారు.
ఆమెకు కరోనావైరస్ సోకినట్లు అనుమానం రావడంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఇక్కడే ఈ సంఘటన జరిగింది. ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ అధిక రక్తస్రావం కారణంగా ఏప్రిల్ 6 న మరణించింది. దీనితో ఆమె ఈమె అంటూ ఫోటోలు వైరల్ చేసారు. మూడేళ్ళ క్రితం ఫోటో అని గుర్తించారు.