కరోనా మాస్క్ ల బదులు జార్బ్ బాల్ ని వాడిన మహిళ….ఎక్కడంటే!

-

కరోనా మహమ్మారి తో చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ లు ధరించకుండా బయటకురావద్దు అని చెబుతున్న విషయం విదితమే. కరోనాను తరిమికొట్టాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా ముఖాలకు మాస్క్ లు ధరిస్తూ తిరుగుతున్నారు. అయితే సూపర్ మార్కెట్ లకు వచ్చేవారు అయితే తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి అని,షాపింగ్ చేసినంత సేపు మాస్క్ లు పెట్టుకొనే ఉండాలి అని చెబుతున్నారు. అయితే యూకే లో మాత్రం ఒక మహిళ ముఖానికె కాకుండా శరీరం మొత్తానికి కూడా మాస్క్ ధరించి మరి సూపర్ మార్కెట్ కు వెళ్ళింది. దీనితో సూపర్ మార్కెట్ లో ఆమె ను చూసిన యాజమాన్యం,సిబ్బంది సైతం షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఆమె ధరించినా ఆ ఒంటి మాస్క్ ఏంటంటే జార్బ్ బాల్. బీచ్ ల వద్ద ఎక్కువగా కనిపించే ఈ జార్బ్ బాల్ ను ధరించిన సదరు మహిళ సూపర్ మార్కెట్ లోపలి వెళ్ళింది. తనతో పాటు తనకు తోడుగా ఒక సహాయకుడిని కూడా తీసుకువచ్చింది. దీనితో జార్బ్ బాల్ తో సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఆ మహిళ తనకు కావాల్సిన వస్తువులను చూపిస్తూ ఉంటే తన వెంట వచ్చిన సహాయకుడు ట్రాలీ లో వాటిని వేస్తూ ఆమె వెంట తిరుగుతున్నాడు. బీచ్ లలో ఈ జార్బ్ బాల్స్ ను ఉపయోగించి నీటిపై తేలియాడుతూ సరదాగా ఆటలాడుతూ ఉంటారు. అలాంటి ఈ బాల్ ని ఆమె గారు ఇలా షాపింగ్ కు వాడుకోవడం చూసిన వారు కొందరు ముక్కున వేలు వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఆ మహిళ ఆలోచన కు నవ్వుకుంటున్నారు.

ఇదేంటని ఆమెతో వచ్చిన సహాయకుడిని సూపర్ మార్కెట్ సిబ్బంది అడిగితే ‘ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంది. ఆమెకు జెర్మోఫోబియా ఉంది’ అంటూ చెప్పాడు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలిసింది. కెంట్ కౌంటీలోని హెర్నే బేలో నివసిస్తున్న ఆమె ఓ ప్రాంక్ స్టార్. ఇలా జార్బ్ బాల్‌లో సూపర్ మార్కెట్ కు వెళ్లి ప్రాంక్ చేసిందట. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news