యశోదా ఆసుపత్రి డాక్టర్ కు కరోనా…కుటుంబం పై కూడా ఎఫెక్ట్!

-

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో కూడా విజృంభిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 వందలకు పైగా కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారు. దేశంలోని తెలంగాణా రాష్ట్రంలో కూడా ఈ కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారే కాకుండా.. వారితో కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, డాక్టర్లు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఓ డాక్టర్‌కు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలినట్లు సమాచారం. ఆయనతో పాటు భార్య, తల్లికి కూడా కరోనా వైరస్ వ్యాపించినట్లు తేలింది. ఐతే గత రెండు వారాల్లో సదరు డాక్టర్ సుమారు 500 మందిని కలిశారు. యశోదాకు చెందిన అన్ని బ్రాంచ్ హాస్పిటల్స్‌ని సందర్శించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆస్పత్రికి సంబంధించి పలు సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఆయన్ను కలిసిన వారందరి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. ఈ డాక్టర్‌ని కలిసిన ఇతర డాక్టర్లలో ఇప్పటికే కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి కూడా పరీక్షలు నిర్వహించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. మరోపక్క తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ఇప్పటివరకు 59 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో 20 వేల మంది ఉన్నారని.. వారికి పరీక్షలు, చికిత్స కొనసాగుతుందని చెప్పారు. అలానే కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి తెలంగాణా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 11000 ఐసోలేషన్ బెడ్స్… 1400 క్రిటికల్ బెడ్స్ రెడీగా ఉన్నాయని.. 60 వేల మంది కరోనా పేషెంట్లు ఉన్నా హాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news