మనకి ఉండే మంచి అలవాట్లు చెడు అలవాట్లు ద్వారా ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లు ఉంటే మంచే జరుగుతుంది. చెడ్డ అలవాట్లు వలన ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉండే కొన్ని అలవాట్ల వల్ల ఇంటికి దరిద్రం వస్తుంది. ఈ అలవాట్లు అసలు స్త్రీలకి ఉండకూడదు. వీటి వలన ఇంట్లో సమస్యలు కలుగుతాయి.
ఇంట్లో చేయకూడని పనులు ఇవే గుర్తుపెట్టుకోండి:
మంగళవారం నాడు ఎవరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు. గడ్డం తీయడం వంటివి చేయకూడదు. ఇటువంటి వాటి వలన దరిద్రం వస్తుంది మగవారికి పిల్లలకి ఈ విషయాలు స్త్రీలే చెప్పాలి.
అలానే స్త్రీలు కానీ ఇంట్లో పిల్లలు కానీ దిండు మీద కూర్చోకూడదు.
అలానే నలుపు రంగు వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఇటువంటివి తప్పులు చేస్తే ఇంట్లో దరిద్రం ఉంటుంది.
అలానే చింతపండు, మిరపకాయలు, ఉప్పు వంటివి చేతితో తీసుకోకూడదు. ఎవరైనా చేతికి ఇస్తుంటే కింద పెట్టమని చెప్పి తీసుకోవాలి.
ఇంట్లో ఎప్పుడూ స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇలా చేస్తే జేష్టాదేవి వచ్చి ఇంట్లో ఉంటుంది.
జీతం పడ్డాక ఆ డబ్బు తో వెంటనే ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బు ఎక్కువగా వస్తుందట.
స్త్రీలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు అలాగే కాళ్లు ఊపుతూ కూర్చోకూడదు. రాత్రివేళ పెళ్లయిన స్త్రీలు భోజనం చేయనని అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రపోతే కూడా దరిద్రం పట్టుకుంటుంది.
ఎవరైనా కుటుంబం బాధలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్లి తిరిగి వెళ్లి వస్తానని చెప్పకూడదు. పెళ్ళైన వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా తిరగకూడదు ఇటువంటి తప్పులు స్త్రీలు చేయడం వలన ఇంట్లో సమస్యలు వస్తాయి.