క్రికెట్​ ఫ్యాన్స్​ కోసం ఆర్టీసీ బస్సులు

-

ఉప్పల్​లో ఇండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మ్యాచ్ పూర్తైన త‌రువాత ఉప్పల్ స్టేడియం నుంచి తిరిగి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో బస్సులు నడుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ విస్తృత రవాణా ఏర్పాట్లు చేసింది.

క్రికెట్‌ స్టేడియం మీదుగా ఉప్పల్‌కు నడిచే సాధారణ బస్సులతో పాటు అదనంగా మొత్తం 55 బస్సులు సేవ‌లు అందిస్తున్నాయి. హైదరాబాద్​ నగరంలోని 22 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. క్రీడాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు కంట్రోలర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ బృందాలు ప‌ర్యవేక్షిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news