స్వాతంత్ర్య పోరాటంలో భారత వీర నారీమణులు

-

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే.. ఇప్పుడు మనం హాయిగా బతుకుతున్నాం. మీకు ఎంతరో స్వాతంత్ర్య సమరయోధులు తెలిసి ఉండొచ్చు. కానీ.. ఈ భారత మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ల పోరాట పటిమ తెలుసా? మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.

చెన్నమ్మ

కర్ణాటకలోకి బెల్గాం ప్రాంతానికి చెందిన కిట్టూరు రాజు.. రాజా మల్ల సర్జా భార్యే చెన్నమ్మ. 1778 లో జన్మించిన ఆమె 1829 లో అమరులయ్యారు. కిట్టూరు రాజు మరణించిన తర్వాత.. రాజ్యాధికారాన్ని చెన్నమ్మ చేపట్టింది. అయితే… 1824లో తమ రాజ్యంపై బ్రిటీష్ వాళ్లు ఆధిపత్యాన్ని చెలాయించడానికి వ్యతిరేకించింది. వాళ్లపై యుద్ధం ప్రకటించింది. కానీ.. బ్రిటీషర్లు ఆమెను ఓడించి ఖైదు చేశారు.

అనిబిసెంట్

అనిబిసెంట్ ఐరిష్ మహిళ, థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1906లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ను ఆమె స్థాపించారు. ఆ సమయంలోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడుకు భారత కోకిల అనే బిరుదు కూడా ఉంది. స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు.

రాణీ లక్ష్మీబాయి

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి.. ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అది. ఆ తర్వాత అనేక సార్లు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు.

సుచేతా కృపలానీ

స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ కు మొదటి మహిళా ముఖ్యమంత్రి. సుచేతా కృపలానీ హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేతా చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఉద్యమంలోనూ సుచేతా కృపలానీ చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీతోనూ సన్నిహితంగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news