మహిళలు వీటిని తప్పక ఆహారంలో చేర్చుకోవాలి..

-

మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం అంత బాగుంటుందని పెద్దలు అంటున్నారు. అది నిజమే..కుటుంబం కోసం నిత్యం పోరాడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మహిళల శరీర పనితీరు సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను వారు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను ఒకసారి చూద్దాం..

టమాటో..

వీటిలో లెకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఎంత మందికి తెలుసు? అంతేకాదు టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది..

పాలకూర..

మహిళల్లో కూడా చాలా మంది పాలకూర తినడానికి విముఖత చూపుతారు. కానీ.. పాలకూర మహిళలకు ఎంతో అవసరం అని చెబుతున్నారు. పాలకూరలోని మెగ్నీషియం.. మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని తెలుసా? అంతేకాదండోయ్.. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా పాలకూరలోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని పాలకూర తప్పకుండా తినాల్సిన అవసరం ఉంది..

ఓట్స్..

ఓట్స్..ఇప్పుడు డ్తెటరీ ఫుడ్ అయ్యింది.ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓట్స్ ను తింటున్నారు.త్వరగా జీర్ణం అవుతుంది.ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఓట్స్ నియంత్రిస్తాయి.

అవిసె గింజలు..

అవిసె గింజలు మార్కెట్లో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. పైగా అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది. వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. స్త్రీలు రోజూ అవిసె గింజలను తినడం ఎంతో మంచిది. మల బద్దకం సమస్య నుంచి అవిసె గింజలు బయట పడేస్తాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫాటీ అమ్లాలు పుష్కలంగా ఉంటాయి…

వీటితో పాటు ఎక్కువగా ఆకు కూరలు, గుడ్లు, మాంసం లను ఎక్కువగా తీసుకోవడంతో శరీరం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం..

Read more RELATED
Recommended to you

Latest news