తమ అమ్మాయిని మంచి ఉద్యోగం ఉన్నవారికి ఇవ్వాలని తల్లిదండ్రులు చూస్తున్నారే తప్పితే… మంచి గుణాలు ఉన్న అబ్బాయికి ఇవ్వాలని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. దీంతో చాలా మంది వరకట్న వేధింపులకు పాల్పడటం, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తూ కట్టుకున్న అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా వరకట్న వేధింపుకు ఓ యువతి బలైంది. పెళ్లైన 10 నెలలకే తనువు చాలించింది. ఇచ్చిన కట్నం చాలదన్నట్లు భర్త నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే … వరకట్న వేధింపుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లో ఉంటున్న శ్రీనివాస్ రావు గతేడాది తన పెద్ద కుమార్తె నిఖిత( 26)ను సిరిసిల్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్ తో పెళ్లి చేశారు. పెళ్లి టైంలో రూ. 10 లక్షలు, 35 తులాల బంగారం ఇచ్చారు. ఇటీవల మరో 10 లక్షలు కట్నంగా ఇచ్చారు. శ్రీనివాస్ రావుకు ఉన్న 4.25 ఎకరాల్లో వ్యవసాయ భూమిలో సగం ఇవ్వాలని ఉదయ్ వేధించడంతో నిఖిత మనోవేదన చెంది ఉరేసుకుంది. కూకట్ పల్లిలో బాలక్రిష్ణనగర్ లో నివాసం ఉంటున్న నిఖిత ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్లలో భర్త ఇంటి ఎదుట నిఖిత డెడ్ బాడీతో బంధువులు ఆందోళన చేస్తున్నారు.