పెళ్లి పీటలు ఎక్కకముందే కాబోయే భర్త వేధింపులు మొదటు పెట్టాడు. నిశ్చితార్థం పూర్తి చేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు వెళ్లగా ఆతరవాత ఉండి కాబోయే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అంతే కాకుండా మానసికంగా ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తల్లి తండ్రులకు చెప్పి వివాహం రద్దు చేయాలని కోరగా వారు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక పెళ్లి తరవాత తన జీవితం నరకమే అని భావించిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. పవిత్ర అనే యువతికి అభినందన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లికి డిసెంబర్ 2న ముహూర్తం పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు కాబోయే దంపతులు ప్రీవెడ్డింగ్ షూట్ కు వెళ్లారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పూర్తయ్యిన నాటి నుండి అభినందన్ పవిత్రపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తను అనుమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. దాంతో పవిత్ర విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా పెళ్లి తరవాత అన్నీ సెట్ అవుతాయంటూ చెప్పారు. కానీ వేధింపులు ఎక్కువ అవడంతో అలాంటి వాడితో జీవించడం కష్టమని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.