ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు… ఇవాళ తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,271 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,37,307 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,35,918 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 285 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,63,530 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,376 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,38,37,859 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,12,01,03,225 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 57,43,840 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
India reports 11,271 #COVID19 cases, 11,376 recoveries & 285 deaths in last 24 hours as per Union Health Ministry.
Case tally: 3,44,37,307
Active cases: 1,35,918
Total recoveries: 3,38,37,859
Death toll: 4,63,530Total Vaccination: 1,12,01,03,225 (57,43,840 in last 24 hours) pic.twitter.com/gifQKu0x0h
— ANI (@ANI) November 14, 2021